ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగం కోల్పోవటంతో.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

ఉద్యోగం కోల్పోయిన ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

software-employ-committed-suicide
సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

By

Published : Feb 23, 2021, 12:35 PM IST

ఉద్యోగం కోల్పోవటంతో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధి సాయికాలనీలో నాగ వెంకట భార్గవ్ అనే సాఫ్ట్​వేర్ ఉద్యోగి తన కుటుంబంతో ఉంటున్నాడు. అయితే ఇంతకు ముందు చెన్నైలో ఉన్న అతను నెల క్రితం హైదరాబాద్​కు ఈ మధ్యనే మారాడు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాల్తూరు గ్రామానికి చెందిన మంజు అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

మంజును డబ్బుకు ఆశపడి పెళ్లి చేసుకున్నావని చాలామంది మాట్లాడటంతో మనస్తాపం చెందాడు. ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఇదే సమయంలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం కోల్పోవటంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడు మరో ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడని.. మార్చి ఒకటో తేదీ నుంచి చేరాల్సి ఉందని బంధువులు చెబుతున్నారు. సోదరుడు రవితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మర్మాంగాలకు కోడి కత్తి తగలడంతో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details