ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Heeramath గనుల తవ్వకాలపై సుప్రీంను ఆశ్రయిస్తాం - జనార్దనరెడ్డితో మైనింగ్ అనుమతులిచ్చిన ఏపీ

Supreme Court on mining in ap కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో 2 కి.మీ. పరిధిలో గనుల తవ్వకాలపై శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్త, సమాజ పరివర్తన సముదాయం వ్యవస్థాపకుడు ఎస్‌.ఆర్‌.హీరేమఠ్‌ తెలిపారు.

Social worker SR Heeramath
గనుల తవ్వకాలపై సుప్రీంను ఆశ్రయిస్తాం

By

Published : Sep 5, 2022, 11:15 AM IST

Social worker SR Heeramath కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో 2 కి.మీ. పరిధిలో గనుల తవ్వకాలపై శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్త, సమాజ పరివర్తన సముదాయం వ్యవస్థాపకుడు ఎస్‌.ఆర్‌.హీరేమఠ్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులకు సంబంధించి ఇప్పటికీ వివాదం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇనుప ఖనిజం పేరిట గతంలో సరిహద్దు రాళ్లను కొందరు తారుమారు చేశారని గుర్తు చేశారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. 2 కి.మీ. పరిధిని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించాల్సిన అవసరం ఉందని, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డితో సహా ఇతరులు తమ భూభాగంలో ఇనుప ఖనిజాన్ని తవ్వుకునేందుకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేయడం దురదృష్టకరమని హీరేమఠ్‌ వ్యాఖ్యానించారు. న్యాయస్థానం దీనిని ఆమోదిస్తే మరోసారి అక్కడ అక్రమంగా ఇనుప ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని, మైనింగ్‌ మాఫియాను అడ్డుకునేందుకు తాము మరోసారి పోరాటానికి సమాయత్తమవుతున్నామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details