ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Soap industry: గిరిపుత్రులకు ఉపాధి చూపుతున్న సబ్బుల పరిశ్రమ - telanaga latestnews

Soap industry: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. మొట్టమొదటి సబ్బుల పరిశ్రమ అది. నేడు ఎందరో గిరిపుత్రులకు ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తోంది. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా... సహజ సిద్ధంగా సబ్బులు తయారుచేస్తున్నారు. ప్రభుత్వం గిరి బ్రాండ్ పేరుతో వినియోగదారులకు చేరువయ్యేలా.. చర్యలు తీసుకుంటోంది

గిరిపుత్రులకు ఉపాధి చూపుతున్న సబ్బుల పరిశ్రమ
గిరిపుత్రులకు ఉపాధి చూపుతున్న సబ్బుల పరిశ్రమ

By

Published : Dec 19, 2021, 10:28 AM IST

గిరిపుత్రులకు ఉపాధి చూపుతున్న సబ్బుల పరిశ్రమ

Soap industry: శరీరానికి పట్టిన మలినాలను తొలగించుకోవాలంటే కావాల్సింది సబ్బు. టీఎఫ్ఎమ్ శాతం ఎక్కువగా ఉండే వాటికే.. ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. నేడు అలాంటి వాటి కోసం వెతకాల్సిన అవసరం లేకుండా చేసింది.. గిరిజన సహకార సంస్థ. అదెక్కడో కాదు తెలంగాణలోని నిర్మల్‌లో జీసీసీ కి చేదోడువాదోడుగా ఉండేందుకు.. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా ఏర్పాటు చేసిన సబ్బుల పరిశ్రమ సత్ఫలితాలను ఇస్తోంది. ఆయుష్ డిపార్టుమెంటు ఫార్ములాతో.. గిరిజన సహకార సంస్థచే నడుస్తున్న ఈ పరిశ్రమలో తయారవుతున్న సబ్బులు చాలా నాణ్యత కలిగి ఉంటాయి. తయారీకి ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా సహజ సిద్ధ ఔషధాలను మాత్రమే వాడుతున్నారు. ఈ సబ్బులను వేప, తులసి, కలబంద అనే మూడు రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ఒక్కొక్కటి 150 గ్రాముల పరిమాణంలో ఉంటాయి.
ఆన్‌లైన్‌లో అటవీ ఉత్పత్తులను ఆదివాసీలు అమ్ముతున్నారు. ఈ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే గిరిజన సహకార సంస్థ కార్పొరేట్ వ్యాపార విధానాన్ని అవలంభిస్తూ.. గిరి బ్రాండ్‌కు డిమాండ్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న.. తేనె, శానిటైజర్ లాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సబ్బుల పరిశ్రమలో.. సుమారు 28 మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు పని లభిస్తోంది. ప్రభుత్వం సబ్బుల పరిశ్రమలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలుంటాయని జీసీసీ ఉద్యోగులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details