తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో పాము కలకలం రేపింది. రోడ్డుపై కాలినడకన వెళుతున్న గడ్డమీది రాజయ్య అనే వ్యక్తి కాలుకు చుట్టుకుని నడవకుండా చేసేసింది. మెల్లగా.. శరీరంపైకి ఎగబాకే యత్నం చేయడంతో బాధితునికి ముచ్చెమటలు పట్టాయి. అయినా ఏమాత్రం భయపడకుండా పాము తలను గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా చుట్టుకున్న పామును చూసి అందరూ భయంతో వణికిపోయారు. మరొకరి సహాయంతో అతికష్టం మీద పామును కాళ్ల నుంచి విడిపించుకున్నాడు. పాము తలను విరిచేందుకు విఫలప్రయత్నం చేశాడు. అనంతరం భూమిపై పడేసి కర్రతో కొట్టి చంపేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
LIVE VIDEO: వ్యక్తి కాళ్లను చుట్టేసిన పాము.. వదిలించుకునేందుకు ముప్పతిప్పలు - జంగపల్లి గ్రామంలో విష సర్పం కలకలం
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో విష సర్పం కలకలం రేపింది. రోడ్డుపై కాలినడకన వెళుతున్న గడ్డమీది రాజయ్య అనే వ్యక్తి కాలుకు చుట్టుకుని నడవకుండా చేసేసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
పాదచారి కాళ్లను చుట్టేసిన పాము.. వదిలించుకునేందుకు ముప్పుతిప్పలు