ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ బీఆర్కే భవన్ ప్రాంగణంలో పాము కలకలం - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్​లోని బీఆర్కే భవన్ ప్రాంగణంలో ఓ పాము కనిపించింది. ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది, ఉద్యోగులు... వెంటనే పాములు పట్టే వారిని రప్పించారు. రంధ్రంలోకి దూరడం వల్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Snake At Brk Bhavan in hyderabad
బీఆర్కే భవన్ ప్రాంగణంలో పాము ప్రత్యక్షం

By

Published : Mar 3, 2021, 10:09 AM IST

బీఆర్కే భవన్ ప్రాంగణంలో పాము ప్రత్యక్షం

తెలంగాణ రాష్ట్ర సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్ ప్రాంగణంలో ఓ పాము కనిపించడం కలకలం రేపింది. భవన్ ప్రాంగణంలో చెత్త వేసే చోట పాము కనిపించింది. కాసేపటి తర్వాత ప్రవేశద్వార సమీపంలోని రంధ్రంలోకి వెళ్లిపోయింది.

ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది, ఉద్యోగులు... వెంటనే పాములు పట్టే వారిని రప్పించారు. అగ్నిమాపక యంత్రాన్ని పిలిపించి రంధ్రాల్లోకి నీటిని పంపించారు. అయినా పాము జాడ కనిపించలేదు. సోమవారం సైతం పాము కనిపించినట్లు కొందరు చెప్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details