ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pushpa: ‘పుష్ప’లా ట్రై చేశాడు.. అడ్డంగా దొరికిపోయాడు - Pushpa: ‘పుష్ప’లా ట్రై చేశాడు.. అడ్డంగా దొరికిపోయాడు

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన చిత్రం ‘పుష్ప’. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించిన విషయం తెలిసిందే. పోలీసుల కంట పడకుండా ఎర్ర చందనాన్ని రాష్ట్రం దాటిస్తుంటాడు. అయితే, నిజ జీవితంలోనూ ఓ వ్యక్తి ‘పుష్ప’ను స్ఫూర్తిగా తీసుకొని రూ.కోట్లు విలువ చేసే ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

Smuggling of red sandalwood in pushpa movie style
Smuggling of red sandalwood in pushpa movie style

By

Published : Feb 4, 2022, 8:04 AM IST

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన చిత్రం ‘పుష్ప’. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించిన విషయం తెలిసిందే. పోలీసుల కంట పడకుండా ఎర్ర చందనాన్ని రాష్ట్రం దాటిస్తుంటాడు. అయితే, నిజ జీవితంలోనూ ఓ వ్యక్తి ‘పుష్ప’ను స్ఫూర్తిగా తీసుకొని రూ.కోట్లు విలువ చేసే ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్న యాసిన్‌ ఇనయాతుల్లా.. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వెళ్లే క్రమంలో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. తన ట్రక్కులో మొదట ఎర్ర చందనం దుంగల్ని పెట్టి.. దానిపై పండ్లు, కూరగాయాల డబ్బాలను ఉంచాడు. పైగా ట్రక్కుకు ‘కొవిడ్‌ - 19, నిత్యావసర ఉత్పత్తులు’ అని స్టిక్కర్‌ కూడా అతికించాడు. అలా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని చెక్‌ పోస్టులను సునాయాసంగా తప్పించుకొని మహారాష్ట్రకు చేరుకున్నాడు. సంగ్లీ జిల్లాలోని గాంధీ చౌక్‌ వద్దకు రాగానే అక్కడి పోలీసులు ట్రక్కును అడ్డుకొని తనిఖీ చేయగా.. అసలు బండారం బయటపడింది.

వెంటనే పోలీసులు డ్రైవర్‌ యాసిన్‌ను అరెస్ట్‌ చేసి.. ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.45 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ‘పుష్ప’ చిత్రంలో కథానాయకుడు పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనం దుంగల్ని పాల ట్యాంకర్‌ అడుగు భాగంలో దాచి.. పైకి పాలు తీసుకెళ్తున్నట్లు నటిస్తాడు. అచ్చం అలాగే యాసిన్‌ కూడా ట్రక్కు లోపల దుంగల్ని పెట్టి.. పండ్లు, కూరగాయాలు తీసుకెళ్తున్నట్లు నాటకమాడాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.

ఇదీ చదవండి:'పుష్ప' తగ్గేదే లే డైలాగ్​పై గరికపాటి ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

pushpa

ABOUT THE AUTHOR

...view details