ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బడ్జెట్​ కేటాయింపుల్లో వైద్యానికి 0.18 శాతం పెరుగుదల - ఏపీ బడ్జెట్ 2020-21

గత బడ్జెట్‌తో పోలిస్తే వైద్య, ఆరోగ్యశాఖకు ఈసారి కేటాయింపులు 0.18 శాతమే పెరిగాయి. ఈసారి బడ్జెట్లో కేటాయించిన రూ.11,419.48 కోట్లను కిందటేడాది కేటాయింపుతో పోలిస్తే పెరుగుదల స్వల్పమే. 2019-20 బడ్జెట్‌లో రూ.11,399.23 కోట్లు కేటాయించి, అంచనాలను రూ.7,408.75 కోట్లకు సవరించారు. ఈ అంచనాలతో పోలిస్తే తాజా బడ్జెట్‌లో కేటాయింపులు రూ.4,010.73 కోట్లు అంటే 54% మేర పెరిగాయి. రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన మొత్తం 5.08%.

state medical budget
బడ్జెట్​ కేటాయింపుల్లో వైద్యానికి 0.18 శాతం పెరుగుదల

By

Published : Jun 17, 2020, 9:18 AM IST

  • ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద వైద్య సేవల విస్తరణకు రూ.2,100 కోట్లు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసుపత్రుల్లో ఔషధాల కొనుగోలుకు రూ.400 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలు పెంచినందుకు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ కింద ఆర్థిక సాయానికి, 9 తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలకు రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున పింఛన్లు అందించేందుకు 33% అదనంగా నిధులు కేటాయించారు.
  • అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన 108 అంబులెన్సులు, గ్రామాల్లో వైద్య సేవలకు ఉపయోగిస్తున్న 104 అంబులెన్సులకు నిధులు పెంచారు.
  • జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద 45% నిధులను పెంచారు. వీటితో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో వైద్య సేవల విస్తరణ, ఎనీమియా ముక్త భారత్‌, వైఎస్సార్‌ క్లినిక్స్‌ ప్రారంభం, జీవనశైలి వ్యాధుల నియంత్రణకు వివిధ కార్యక్రమాలు చేపడతారు. ఈ నిధుల్లో కేంద్రం 60% భరిస్తోంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నాడు-నేడు’ పథకం కింద ఆస్పత్రుల అభివృద్ధికి రూ.1,528 కోట్లు కేటాయించారు. ఆస్పత్రుల్లో పడకలు, మౌలిక సదుపాయాలు పెంచేందుకు, పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వినియోగిస్తారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రకటనలకు తగ్గట్లుగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కనిపించలేదు.

ఆశాలకు నెలకు రూ.10 వేల చొప్పున చెల్లించేందుకు రూ.2,294.74 కోట్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఎ.ఎన్‌.ఎం., ఇతర ఆరోగ్య కార్యకర్తల వేతనాలకు రూ.242.51 కోట్లు కేటాయించారు.

ABOUT THE AUTHOR

...view details