రాష్ట్రంలో కొత్తగా 13,756 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 20,392 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,73,622 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 79,564 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మృతులు
కరోనాతో పశ్చిమగోదావరి జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8 మంది చొప్పున మృతిచెందారు.