ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

hc on skill development case: 'డబ్బులిచ్చిన అధికారిని నిందితుడిగా ఎందుకు పేర్కొనలేదు'

hc on skill development case: సీమెన్స్ ప్రాజెక్టు నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఆ సంస్థ సీఈవో, ఎండీగా వ్యవహరించిన గంటా సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ డి రమేశ్ .. నిధులు ఎవరు విడుదల చేశారు? చెల్లింపులు చేసిన అధికారిని నిందితుడిగా ఎందుకు పేర్కొనలేదని న్యాయమూర్తి సీఐడీని ప్రశ్నించారు.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Dec 16, 2021, 5:00 AM IST

hc on skill development case:ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టు నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఆ సంస్థ సీఈవో, ఎండీగా వ్యవహరించిన గంటా సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ డి రమేశ్ .. నిధులు ఎవరు విడుదల చేశారు? చెల్లింపులు చేసిన అధికారిని నిందితుడిగా ఎందుకు పేర్కొనలేదని న్యాయమూర్తి సీఐడీని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేశారు.

అంతకు ముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ .. 'పిటిషనర్ విద్యావంతుడు. విద్యార్థులకు సేవచేయాలన్న ఉద్దేశంతో విదేశం నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన సేవలను గుర్తించి , అప్పటి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఉన్నతపదవిలో నియమించింది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు సీమెన్స్ సంస్థతో ఒప్పంద చేసుకున్నారు. ఆ సంస్థ ప్రాజెక్ట్ కోసం అవసరమైన నిధుల్లో 90 శాతం భరిస్తుంది. మిగిలిన 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేయాలి. పిటిషనర్ బాధ్యతలు నిర్వహించిన కాలంలో ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. బిల్లులు చెల్లింపు కోసం సొమ్ము వినియోగించలేదు. ఆయనను పబ్లిక్ సర్వెంట్ గా భావించి సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకోనందున ఆయనకు అనినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం వర్తించదు. నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సోదాలు చేశారు. ఆ సమయంలో రౌడీల్లా వ్యవహరించారు. పిటిషనర్ తర్వత బాధ్యతలు చేపట్టిన ఓ ఐఏఎస్ అధికారి చెల్లింపుల నిమిత్తం నిధుల్ని విడుదల చేశారు. ఆయన్ని నిందితుడిగా పేర్కొనలేదు. దానికి కారణం ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తి ఆవ్వడమే. గత రెండేళ్లలో సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఒక్క అభియోగపత్రం దాఖలు చేయలేదు. అని పేర్కొన్నారు. సీఐడీ తరపు న్యాయవాది కృష్ణ చైతన్య వాదనలు వినిపిస్తూ .. నిధుల దుర్వినియోగంలో పిటిషనర్ కీలక పాత్ర అన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 20 మందిని నిందితులుగా పేర్కొన్నామన్నారు. బెయిలు మంజూరు చేయవద్దని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ .. ప్రైవేటు కంపెనీలకు చెక్కులు జారీచేసిన అధికారిని నిందితునిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోరడంతో విచారణను నేటికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి:

AMARAVATI FARMERS: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమరావతి రైతులు

ABOUT THE AUTHOR

...view details