కోర్టు ధిక్కరణ కేసులో ఆరుగురు అధికారులకు 6 నెలల జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ...తెలంగాణ హైకోర్టు (High Court) తీర్పునిచ్చింది. వీరిలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి.... రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్‌తోపాటు... ఐఎఫ్ఎస్ (IFS) అధికారులు శోభ, సునీత, అదనపు కలెక్టర్ తిరుపతిరావు, రంగారెడ్డి జిల్లా అటవీ అధికారి జానకిరాం ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని 383 ఎకరాల భూమిని రిజర్వు ఫారెస్ట్‌గా మార్చాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని... 2008లో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి... రంగారెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.