Orphan baby: బుడి బుడి అడుగులు వేస్తూ అల్లారు ముద్దుగా కనిపిస్తున్న కార్తీక్ అనే బాలుడు.. ఆరు నెలల వయసు నుంచే అనాథగా పెరుగుతున్నాడు. తెలంగాణలోని నిజామాబాద్ బస్టాండ్‌లో బిక్షాటన చేస్తున్న మహిళ నుంచి గుర్తు తెలియని వ్యక్తి బాబును కొనుగోలు చేశాడు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా వ్యక్తిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తాత్కాలిక వసతి కోసం హైదరాబాద్ శిశువిహార్‌కు పోలీసులు తరలించారు. అప్పటి నుంచి చిన్నారిని సంరక్షించిన హైదరాబాద్ చైల్డ్ వెల్పేర్ కమిటీ సభ్యులు తదుపరి దర్యాప్తు కోసం నిజామాబాద్‌కు పంపించారు. రెండు నెలలుగా నిజామాబాద్ శిశు గృహలో కార్తీక్ వసతి పొందుతున్నాడు. శిశు గృహ సిబ్బంది బాలునికి ఏ లోటూ రాకుండా సపర్యలు చేస్తున్నా.. మాతృ ప్రేమను ఇవ్వలేకపోతున్నామని ఉద్వేగంతో చెబుతున్నారు.
ఊహ తెలిసినప్పటి నుంచి..
ఆరు నెలల క్రితం అమ్మ ఒడికి దూరమైన బాలుడు ఊహ తెలిసినప్పటి నుంచి శిశు గృహలోనే గడిపాడు. ఎవరి స్వార్థానికి అనాథగా మిగిలిపోయాడో అర్థం చేసుకునే వయసు కాదు. అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల ఆదరాభిమానాల మధ్య పెరగాల్సిన బాలుడు శిశుగృహలో ఆశ్రయం పొందుతున్నాడు.
కంటికిరెప్పలా కాపాడుతున్న సిబ్బంది..