Encounter At Telangana- Chhattisgarh Border : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సుక్మా జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
Maoists Died At Charla : చర్ల మండలానికి 25 కి.మీ. దూరంలో కుర్ణవల్లి - పెసర్లపాడు అటవీప్రాంతంలో 6 గం. నుంచి 7.30 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు చెప్పారు.
తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సమయంలోనే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.