'రాష్ట్ర ఆర్థిక వనరుల్ని పరిగణనలోకి తీసుకోలేదు'
శివరామకృష్ణన్ కమిటీలో పనిచేసిన సభ్యుడిగా... అప్పుడు సిఫార్సు చేసిన అంశాలనూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని జీఎన్‌రావు కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కెటీ రవీంద్రన్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రాంతీయ ఆర్థిక సమతౌల్యం ఉండాలన్నదే కమిటీ అభిప్రాయమని ఉద్ఘాటించారు. ప్రభుత్వం ఈ అంశాన్నే నిర్దేశించి అధ్యయనం చేయాల్సిందిగా సూచించిందని వివరించారు. సచివాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయటమే సముచితమైన నిర్ణయంగా భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. గతంలోనూ శివరామకృష్ణన్ కమిటీ ఇదే అంశాన్ని వెల్లడించిందన్నారు. పాలన వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక వనరుల్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన 'ఈటీవీభారత్'కు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు.
sivaramakrishna-committee-report
.