ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ సోదరీమణులకు తీరని విషాదం.. రాఖీకి ముందు రోజే వారి సోదరుడి దుర్మరణం - తెలంగాణ వార్తలు

ఐదుగురు అక్కాచెల్లెళ్లు తమ ఒక్కగానొక్క సోదరునికి రాఖీ కట్టాలని ఎంతో ప్రేమగా పుట్టింటికి వచ్చారు. కానీ వారందరికీ ఈ ఏడాది రాఖీ పండుగ తీరని దు:ఖాన్ని మిగిల్చింది. తెల్లారితే పండుగ అనగా రాత్రికి రాత్రే ఆ సోదరుడు కన్నుమూశారు. తోబుట్టువుల పండుగ (Raksha Bandhan) నాడే సోదరుడు శాశ్వతంగా తమను వదిలివెళ్లాడని.. కడసారిగా రాఖీలు కడుతూ ఆ అక్కాచెల్లెళ్లు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

రాఖీ
sisters tied rakhi to their brothers dead body

By

Published : Aug 23, 2021, 12:43 PM IST

రఖీ పర్వదినాన సోదరుడు మృతి

రాఖీ పండుగ ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీ కట్టేందుకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. కానీ ఆ సోదరుడు పుండగకు ముందు రోజు రాత్రే అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతపల్లికి చెందిన లక్ష్మయ్యకు.. ఐదుగురు అక్కాచెల్లెళ్లు. ప్రతి ఏడు మాదిరిగానే అంతా కలిసి తమ ఒక్కగానొక్క సోదరుడి ఇంటికి వచ్చారు. తెల్లారితే రాఖీలు కట్టాలని ఆరాటపడ్డారు.

ఇంతలోనే లక్ష్మయ్య కన్నుమూత.. వారికి తీరని మనోవేదన మిగిల్చింది. అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తుండగా సోదరుడికి చివరసారి రాఖీలు కట్టి తుది వీడ్కోలు పలికారు. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. తోబుట్టువుల పండుగ (Raksha Bandhan) నాడే ఇలా జరగడం.. ఆ గ్రామంలో విషాదఛాయలు నింపింది.

ABOUT THE AUTHOR

...view details