ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

sirpurkar commission: ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంపై సిర్పూర్కర్‌ కమిషన్‌ అసహనం - telangana news

తెలంగాణ రాష్ట్రంలో దిశ నిందితుల ఎన్​కౌంటర్​ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులపై సిర్పూర్కర్ కమిషన్ (sirpurkar commission) అసహనం వ్యక్తం చేసింది. ఎన్​కౌంటర్​లో పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు ఘటనా స్థలంలో సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు ఎందుకు నమోదు చేసుకున్నారని ప్రశ్నించింది.

sirpurkar commission
sirpurkar commission

By

Published : Sep 28, 2021, 9:17 PM IST

తెలంగాణ రాష్ట్రంలో దిశ నిందితుల ఎన్​కౌంటర్​ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్​ తీరుపై సిర్పూర్కర్ కమిషన్ (sirpurkar commission) అసహనం వ్యక్తం చేసింది. ఎన్​కౌంటర్ జరిగిన చోట మృతదేహాలు పడి ఉన్న తీరును ప్రత్యక్షంగా వెళ్లి ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఎన్​కౌంటర్​లో పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు ఘటనా స్థలంలో సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు ఎందుకు నమోదు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రజలు భారీ ఎత్తున గుమిగూడటంతోనే వెళ్లలేకపోయం..

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల బృందాన్ని విచారించింది. ఎన్​కౌంటర్ జరిగిన రోజు... ఘటనా స్థలంలో ప్రజలు భారీ ఎత్తున గుమిగూడటంతో... అక్కడికి వెళ్లలేకపోయామని బృంద సభ్యులు తెలిపారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని మృతదేహాల పంచనామా నిర్వహించగా... మీరు ఎందుకు వెళ్లలేకపోయారని బృంద సభ్యులను సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది.

సజ్జనార్​ను మరో రోజు విచారణకు పిలిచే అవకాశం...

‘దిశ’ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్​ను బుధవారం రోజు విచారణకు హాజరు కావాలని సిర్పూర్కర్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ... ముందుగా మృతదేహాలను తీసుకెళ్లిన డ్రైవర్లతో పాటు, డాక్టర్లను కమిషన్ విచారించే అవకాశం ఉంది. దీంతో సజ్జనార్​ను మరో రోజు విచారణకు పిలిచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

Sajjala: 'మంచి చేయాలని చూస్తున్నాం.. బురద చల్లాలని చూస్తే పవన్​కే ఇబ్బంది'

ABOUT THE AUTHOR

...view details