Saree to Fit in Matchbox: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో, దబ్బనంలో ఇమిడి పోయే చీరలను తయారు చేసి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు చేనేత కళ వైభవాన్ని ప్రపంచానికి చాటిన పలువురు చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను చేసినా.. అవి కట్టుకునేందుకు అనువుగా ఉండేవి కాదు. కానీ.. హరి ప్రసాద్ మాత్రం.. బంగారం జరీ పోగుతో.. కట్టుకునేందుకు వీలుగా ఉండే చీరలను తయారు చేశాడు.
Saree to Fit in Matchbox: అగ్గిపెట్టెలో ఇమిడిపోయే.. బంగారు చీర నేసిన నేతన్న! - అమరావతి తాజా వార్తలు
Saree to Fit in Matchbox: తెలంగాణలోని సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ అగ్గిపెట్టెలో, దబ్బనంలో ఇమిడే చీరలను తయారు చేశాడు. బంగారం జరీ పోగుతో.. కట్టుకునేందుకు వీలుగా.. అగ్గిపెట్టెలో ఇమిడి పోయేలా చీరను తయారు చేసి ఔరా అనిపించాడు.

Saree to Fit in Matchbox
అగ్గిపెట్టెలో ఇమిడి పోయే బంగారు జరీ చీర నేసిన నేతన్న
న్యూజిలాండ్‌కు చెందిన సునీత - విజయ భాస్కర్ రెడ్డి దంపతుల కోరిక మేరకు రూ.పదివేల ఖర్చుతో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశానని హరి తెలిపారు. ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 180 గ్రాముల బరువు ఉందని వెల్లడించారు. దబ్బనంలో ఇమిడే చీర కూడా కట్టుకునేందుకు వీలుగా ఉంటుందని.. దాని బరువు 350 గ్రాములు ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:REVANTH REDDY ARREST: ఉద్రిక్తతల నడుమ రేవంత్ రెడ్డి అరెస్టు..