వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), కాలుష్య ధ్రువీకరణ, బీమా.. తదితర పత్రాలన్నీ జేబుల్లోనో, వాహనాల్లోనో ఉంచుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. పొరపాటున వాటిని తమ వెంట తీసుకెళ్లడం మరచిపోయినా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. వాహనాల పత్రాల కోసం రవాణాశాఖ అధికారులు ఓ యాప్ సిద్ధం చేస్తున్నారు. దీనిని ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకొని అందులో వాహనం నంబరుగానీ, ఫోన్ నంబరుగానీ నమోదు చేస్తే.. ఆయా పత్రాలన్నీ కనిపిస్తాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని అదే యాప్‌లో భద్రపరచుకునే అవకాశం కూడా ఉంటుంది. తనిఖీల సమయంలో యాప్‌లో వాటిని చూపిస్తే సరిపోతుంది.
ఇక వాహనాల పత్రాలన్నింటికీ ఒకే యాప్
ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్, కాలుష్య ధ్రువీకరణ వంటి పత్రాలన్నింటికీ రవాణా శాఖ అధికారులు ఓ యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇకపై పొరపాటున మీరు వాహన పత్రాలను తీసుకెళ్లడం మరచిపోయినా ఆందోళన చెందాల్సిన పని ఉండదు,
వాహనాల పత్రాలన్నింటికీ ఒకే యాప్
ఆర్సీ, లైసెన్స్, వాహనాల ఇన్సూరెన్స్, కాలుష్య ధ్రువీకరణ గడువు ముగిసినా చాలామంది చూసుకోకపోవడంతో.. తనిఖీల సమయంలో వారు జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. ఇకమీదట ఆయా పత్రాల గడువు ముగిసే ముందుగా వాహనదారులను రవాణాశాఖ అప్రమత్తం చేస్తుంది.
ఇదీ చదవండి:ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్
Last Updated : Jun 8, 2022, 5:31 AM IST