తెలంగాణలోని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి (siddipet collector Venkata rami reddy resign news) తన పదవికి రాజీనామా చేశారు. బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు (CS SOMESH KUMAR) రాజీనామా లేఖ అందించారు. త్వరలోనే వెంకట్రామిరెడ్డి తెరాసలో చేరనున్నట్లు సమాచారం. తెరాస.. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వెంకట్రామిరెడ్డి ప్రస్థానం
వెంకట్రామిరెడ్డి స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల. 1991లో గ్రూప్-1 అధికారిగా ప్రభుత్వ సర్వీస్‌ల్లో వెంకట్రామిరెడ్డి (Venkata rami reddy ) చేరారు. బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా వెంకట్రామిరెడ్డి పనిచేశారు. మెదక్‌లో డ్వామా పీడీగానూ, హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా కూడా పని చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఏడేళ్లు జేసీగా, కలెక్టర్‌గా పనిచేశారు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐఏఎస్‌గా వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
అందుకే రాజీనామా
తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించినట్లు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 26 ఏళ్ల పాటు వివిధ ప్రభుత్వాల్లో పనిచేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక తెరాసలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చేస్తున్న అభివృద్ధి పనుల్లో తాను పాలుపంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తానని తెలిపారు.
నా రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. 26 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వాల్లో పనిచేశా. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోంది. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక తెరాసలో చేరతా. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తా..
- వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్