‘మద్యం మహమ్మారి దుష్ప్రభావాలు, రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం’ అనే అంశంపై ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు కమిటీ ఛైర్మన్ వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పేర్ని నాని సచివాలయంలో గురువారం ఆవిష్కరించారు.
మద్యం దుష్ప్రభావాలపై షార్ట్‌ఫిల్మ్ పోటీలు - అమరావతి వార్తలు
'మద్యం మహమ్మారి దుష్ప్రభావాలు, రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం' అనే అంశంపై ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పేర్ని నాని విడుదల చేశారు.
మద్యం దుష్ప్రభావాలపై షార్ట్‌ఫిల్మ్ పోటీలు
తెలుగులో తీసిన, 5 నుంచి 10 నిమిషాలలోపు నిడివితో కూడిన షార్ట్ ఫిల్మ్‌లను ఈ నెల 25లోపు apmvpc.gov.in@gmail.comమెయిల్‌కు పంపాలని లక్ష్మణరెడ్డి సూచించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ కేటగిరీల కింద మొత్తం 15 షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేసి గాంధీ జయంతి రోజున నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 87900 05577, 93812 43599 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఇదీ చదవండి:ఆలయ రికార్డులను ఆయనెలా పరిశీలిస్తారు?