మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కడపలోని శివాలయాలు.. భక్తులతో శివనామ స్మరణతో హోరెత్తుతున్నాయి. కడపలో ప్రసిద్ధిగాంచిన మృత్యుంజయ కుంట శివాలయం, నవి కోట శివాలయం, మోచంపేట్ శివాలయం, దేవుని కడప శివాలయంలాల్లో.. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు - shivaratri latest news
11:52 March 11
కడపలో శివరాత్రి పూజలు
10:21 March 11
అనంతపురం శ్రీ కాశీ విశ్వనాథ పరమేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు
అనంతపురం శ్రీ కాశీ విశ్వనాథ పరమేశ్వరుని ఆలయంలో ఆ పరమశివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేసి మహామంగళ హారతులతో పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది.
10:15 March 11
భక్తులతో కిటకిటలాడుతున్న పంచారామ క్షేత్రాలు
పంచారామ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి దర్శనానికి.. భక్తులు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అమరలింగేశ్వర స్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతుంది. పెదకాకాని మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పాలకొల్లు, ద్రాక్షారామంలోనూ.. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
09:41 March 11
శ్రీకాకుళం జిల్లా.. పంచలింగ క్షేత్రాలలో ఒకటైన ఉమారుద్రకోటేశ్వరస్వామికి పూజలు
మహాశివరాత్రి పర్వదినం కావడడంతో.. శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలు సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీకాకుళం నాగావళి నదీ తీరంలో ఉన్న పంచలింగ క్షేత్రాల్లో ఒక్కటైన.. ఉమారుద్రకోటేశ్వరస్వామి ఆలయంలోని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. జిల్లాలోని శైవక్షేతాలు శివనామన్మరణంతో హోరెత్తున్నాయి.
09:24 March 11
తూర్పుగోదావరి జిల్లాలో శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు
మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలలో శివుని దర్శనంకై భక్తులు పోటెత్తారు. వేకువజామునే పూజలు చేశారు.
09:17 March 11
కర్నూలు జిల్లా భీమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిట
కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో వెలిసిన భీమలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే
శివునికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, బిల్వార్చన, మహామంగళ హారతి పూజలు చేశారు. శివనామస్మణతో ఆలయం మారుమోగుతుంది. ఈ అర్ధరాత్రి శివపార్వతులకు కల్యాణం జరుపుతారు. అదే విదంగా దేవరగట్టులో కొలువైన మాళ మల్లేశ్వరస్వామి దేవాలయంలోనూ భక్తులు పోటెత్తారు.
08:59 March 11
ప్రకాశం జిల్లాలో మారుమోగిన శివనామస్మరణ
ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో రుద్రాక్ష శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్లలో భక్తులువేచి ఉన్నారు. శివలింగానికి అభిషేక పూజ కార్యక్రమాలను భక్తులు చేస్తున్నారు.
07:40 March 11
పంచారామక్షేత్రమైన సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రమైన సోమేశ్వర జనార్ధన స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఇక్కడ స్వామివారిని చంద్రుడు ప్రతిష్టించడంతో ఇక్కడ స్వామివారిపై చంద్రకళలు కనిపిస్తూ వుంటాయి. పౌర్ణమికి తెలుపు వర్ణంలోను, అమావాస్యకి నలుపు వర్ణంలోనూ మారుతూ ఇక్కడ స్వామివారు దర్శనమిస్తూ వుంటారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం ,ప్రత్యేక పూజలు నిర్మిస్తున్నారు. ఈ ఆలయం పైభాగంలో అన్నపూర్ణా దేవి అమ్మవారు కొలువై వుండటం ఇక్కడ ప్రత్యేకత.
07:36 March 11
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు
- శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
- తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు
- తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు
- శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో అభిషేకాలు, పూజలు
07:31 March 11
భక్త జన సంద్రమైన శ్రీశైల మల్లన్న క్షేత్రం
శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్త జన సంద్రమైంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి.. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రికి పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల కల్యాణం జరగనుంది.
07:27 March 11
కర్నూలు జిల్లాలో మహానంది ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లా మహనంది ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
07:20 March 11
పశ్చిమగోదావరి జిల్లాలోని శైవక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని పలు శైవక్షేత్రాల్లో భక్తులు పోటెత్తారు. లక్ష్మణేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మనేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు సమీప గోదావరి పుష్కర ఘాట్లో పుణ్య స్నానాలు ఆచరించి.. స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నరసాపురంలోని కపిల మల్లేశ్వర స్వామి, అమరేశ్వర స్వామి, విశ్వేశ్వర స్వామి, ఏకాంబరేశ్వర స్వామి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్నారు.
07:03 March 11
శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు
కృష్ణాజిల్లా.. మోపిదేవి మండలం పేదకళ్లెపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన పెదకళ్ళేపల్లిలో తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. ప్రతీ ఏటా శివరాత్రి మహోత్సవం నాడు సుమారు లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు ఈ ఏడాది కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశారు.
06:53 March 11
శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
- మహాశివరాత్రి సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు
- శ్రీశైలంలో తెల్లవారుజాము 2 గంటల నుంచే ప్రారంభమైన దర్శనాలు
- సాయంత్రం మల్లికార్జున స్వామికి లింగోద్భవ కాల మహాన్యాస రుద్రాభిషేకం
- సంప్రదాయం ప్రకారం రాత్రి 10 గంటలకు శ్రీశైలం మల్లన్నకు పాగాలంకరణ
- పాగాలంకరణ అనంతరం స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం
06:51 March 11
గుంటూరు: కోటప్పకొండపై వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
- కోటప్పకొండపై తొలిపూజ అందుకున్న త్రికూటేశ్వరస్వామి
- ఉత్సవాలకు హాజరుకానున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- త్రికూటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి వెల్లంపల్లి
- వివిధ చోట్ల నుంచి కోటప్పకొండకు 750 ఆర్టీసీ బస్సులు
- కొండ దిగువ నుంచి ఆలయానికి 50 ప్రత్యేక బస్సులు
06:50 March 11
శ్రీకాళహస్తీశ్వరాలయంలో వేకువజాము నుంచే దర్శనానికి అనుమతి
- శ్రీకాళహస్తి: స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం బారులుదీరిన భక్తులు
- శ్రీకాళహస్తి: ఆలయంలో మహా లఘు దర్శనం ఏర్పాటు
- ఉదయం ఇంద్ర విమానం, చప్పరంపై ఊరేగనున్న స్వామి, అమ్మవార్లు
06:16 March 11
హర హర మహాదేవ్...
- గుంటూరు: కోటప్పకొండపై వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
- కోటప్పకొండపై తొలిపూజ అందుకున్న త్రికూటేశ్వరస్వామి
- ఉత్సవాలకు హాజరుకానున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- త్రికూటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి వెల్లంపల్లి
- వివిధ చోట్ల నుంచి కోటప్పకొండకు 750 ఆర్టీసీ బస్సులు
- కొండ దిగువ నుంచి ఆలయానికి 50 ప్రత్యేక బస్సులు