Shilpa Chowdary case: అధిక వడ్డీ ఇస్తానంటూ రూ.కోట్లలో మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరిపై మరో కేసు నమోదైంది. తన వద్ద రూ.2.4 కోట్లు తీసుకుని మోసం చేసిందని తెలంగాణలోని నార్సింగి ఠాణాలో మరో మహిళ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది అధిక వడ్డీ ఇస్తానని డబ్బు తీసుకుందని.. ఇవ్వకుండా మోసం చేసిందని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటివరకూ నార్సింగి పీఎస్లోనే శిల్పా చౌదరిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.
కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు
శిల్పా చౌదరి దంపతులు అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు.. నిందితులను కస్టడీకి కోరారు పోలీసులు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏడు రోజుల కస్టడీ కోరారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు శిల్పా చౌదరి దంపతులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.