ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ జానీ పాషా, ప్రధాన కార్యదర్శిగా జి.హరీంద్ర, సహ అధ్యక్షుడిగా చందు నాగార్జున ఎన్నికయ్యారు. విజయవాడలోని ఎన్జీవో భవన్‌లో ఆదివారం జరిగిన కార్యనిర్వాహక సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా సభ్యులు పలు తీర్మానాలు చేశారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై అక్టోబరు 2నాటికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా సచివాలయాల పరిధిలోనే ‘సలాం సీఎం సార్’ పేరుతో ప్రతి ఉద్యోగి మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఫైబర్‌నెట్(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో సీఎం జగన్ అవినీతి రహిత వ్యవస్థకు బాటలు వేశారని తెలిపారు. బాగా శ్రమిస్తూ కొత్త వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే సమాఖ్య ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు జానీ పాషా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థలో భాగస్వాములవ్వడం తమ అదృష్టమని తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడిగా జానీ పాషా.. - The new president of the Secretariat Employees Union
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య నూతన అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ జానీ పాషా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థలో భాగస్వాములవ్వడం తమ అదృష్టమని పాషా తెలిపారు.
![సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడిగా జానీ పాషా.. Secretariat Employees Union president Johnny Pasha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13046717-133-13046717-1631499101784.jpg)
సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడిగా జానీ పాషా