ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YSRTP: వైఎస్ఆర్ సంక్షేమ పాలన లక్ష్యంగా పార్టీ ఏర్పాటు: షర్మిల - షర్మిల వార్తలు

నేటి నుంచి జెండా పండుగ నిర్వహిస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. హైదరాబాద్​లోని లోటస్ పాండ్​లో పార్టీ జెండా ఎగరవేశారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన రాష్ట్రంలో తీసుకురావటమే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు చెప్పారు.

sharmila
వైఎస్ షర్మిల

By

Published : Aug 5, 2021, 10:14 PM IST

తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకురావటమే లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. లోటస్ పాండ్​లోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. గతంలో వైఎస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని అన్నారు.

ప్రజల పక్షాన పోరాడితే... వారు ఆదరిస్తారని, సమస్యలు గుర్తించి వాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన పార్టీ జెండా ఎగరేసి సంక్షేమ పాలన మళ్లీ తిరిగి రాబోతుందని అందరికీ చెప్పేందుకు జెండా పండుగలను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో జెండా పండుగ నిర్వహించే వారు సంబంధిత ఫొటోలను వాట్సాప్ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

CBN: దేవినేని కాన్వాయ్​ను అడ్డుకోవటం హేయం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details