ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెలంగాణ సీఎం అభ్యర్థిగా వైఎస్​ షర్మిల!' - sharmila fan said Telangana next CM Sharmila

తెలంగాణలో షర్మిలమ్మ త్వరలోనే పార్టీ పెడుతుందని ఆమె ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే.. షర్మిలమ్మే సీఎం అవుతుందని తెలిపారు. వైఎస్​ రాజశేఖర్​రెడ్డికి షర్మిల జిరాక్స్​కాపి అన్నారు.

ys sharmila may open new party in telangana her close people said
'తెలంగాణ సీఎం అభ్యర్థిగా వైఎస్​ షర్మిల ! పార్టీ పెడతారా?'

By

Published : Feb 9, 2021, 4:11 PM IST

'తెలంగాణ సీఎం అభ్యర్థిగా వైఎస్​ షర్మిల ! పార్టీ పెడతారా?'

ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్లు పార్టీలు పెట్టొద్దని ఎక్కడా రాజ్యాంగంలో లేదని షర్మిల ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్లు నాలుగైదు పార్టీల్లో ఉన్నవాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. వైకాపాతో ఇక్కడ కొనసాగించకుండా ప్రత్యేక పార్టీ పెట్టడానికి కారణం ఏ పార్టీకి తోకగా ఉండటానికి సిద్ధంగా లేమని వెల్లడించారు. ఇక్కడ కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని స్పష్టం చేశారు.

రాజశేఖర్​ కుటుంబంలో పొత్తుల అంశమనేది లేదని వెల్లడించారు. తెలంగాణ సీఎం అభ్యర్థిగా షర్మిలనే ఉంటుందని... అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. 3,212 కిలోమీటర్లు నడిచిన ప్రపంచంలో ఏకైక మహిళ షర్మిలమ్మ అని కొనియాడారు. ఆమెకు కష్టాలు తెలుసు... సుఖాలు తెలుసు.. పాదయాత్ర తెలుసు.. అన్నింటికంటే ముఖ్యంగా ఆమెకు రాజన్న మనసు తెలుసని వ్యాఖ్యానించారు. ఆరేడు నెలల్లో చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర చేస్తారని రాఘవరెడ్డి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details