చిత్తూరు జిల్లా ముత్యాలరెడ్డిపల్లెకి చెందిన కోబాకు కృష్ణారెడ్డిది వ్యవసాయ కుటుంబం. ప్రస్తుతం న్యూ బాలాజీ కాలనీగా పిలుస్తున్న ప్రాంతంలో.. ఒకప్పుడు ఆయన కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేది. ఈయన కుమారుడు కోబాకు శంకర్ రెడ్డి, గ్రామంలోని ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తూ.. పలువురికి సాయం చేస్తూ... సేవాగుణం కలిగిన వ్యక్తిగా ముత్యాలరెడ్డిపల్లెలో మంచి పేరు గడించారు. ఈనేపథ్యంలో 1970లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీ సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్నుంచి 1999 వరకు ఆయన జైత్రయాత్ర కొనసాగింది. 29 సంవత్సరాలు ముత్యాలరెడ్డిపల్లె పంచాయతీకి సర్పంచిగా ఎన్నికయ్యారు.
తుది శ్వాస అక్కడే..