ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​ - రిమాండ్​ రిపోర్టులో వెలుగులోకి కీలక విషయాలు

శంషాబాద్ ఘటనపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా మహమ్మద్ ఆచూకీ తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు.

శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​
శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​

By

Published : Nov 30, 2019, 9:45 PM IST

శంషాబాద్ ఘటనపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు నిందితులు యువ పశువైద్యురాలిపై అత్యాచారం చేసి... ముక్కు, నోరు మూయడం వల్లే ఊపిరాడక యువతి మృతి చెందిందని పోలీసులు రిమాండ్​ నివేదికలో పేర్కొన్నారు. వైద్యురాలి ఫోన్‌ నెంబర్ తీసుకున్న నిందితుడు మహమ్మద్ ఆరిఫ్... 15నిమిషాలైనా స్కూటీ తీసుకరాకపోవడం వల్ల యువతి ఆరిఫ్​కు ఫోన్​ చేసిందన్నారు. యువతి చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా మహమ్మద్ ఆచూకీ తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు. వైద్యురాలిపై రాత్రి 9.30 నుంచి 10.20 వరకు అత్యాచారం చేశారని చెప్పారు. షాద్‌నగర్ బ్రిడ్జి కిందికి యువతిని దింపిన నిందితులు... బతికి ఉంటుందన్న అనుమానంతో తగలబెట్టారని పోలీసులు రిమాండ్​ రిపోర్టులో పేర్కొన్నారు.

శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్​

ABOUT THE AUTHOR

...view details