ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎండలతో జాగ్రత్త: 7 జిల్లాలు, 180 మండలాల్లో వడగాలులు తీవ్రం

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో.. సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వడగాలుల ప్రభావం అధికమవుతోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

hailstorms
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత

By

Published : Apr 3, 2021, 7:04 AM IST

ఏప్రిల్‌ ప్రారంభంలోనే వేసవి ఠారెత్తిస్తోంది. విజయవాడతో సహా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు నమోదయ్యాయి. మరో 180 మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లాలోని 4 మండలాలు, పశ్చిమగోదావరి 15, కృష్ణా 9, గుంటూరు 11, ప్రకాశం 8, నెల్లూరు 3, చిత్తూరు 2 మండలాల్లో.. మొత్తంగా 52 మండలాల్లో వడగాలులు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది.

అనంతపురం మినహా 12 జిల్లాల్లోని 180 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇక్కడ సాధారణంకన్నా 5, 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2 రోజుల్లో వడగాలుల ఉద్ధృతి తగ్గనుందన్న సూచనలున్నాయి. శనివారం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 19 మండలాల్లో మాత్రమే వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. - వాతావరణ శాఖ

ABOUT THE AUTHOR

...view details