Amaravati Farmers Padayatra : రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటం నిర్విరామంగా కొనసాగుతోంది. అమరావతి కోసం అన్నదాతలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. పాదయాత్రకు తాత్కాలికంగా నిన్న విరామం ఇచ్చిన రైతులు నేడు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి ప్రారంభించారు. ఈరోజు ఏలూరు నుంచి కొవ్వలి వరకు 14కి.మీ మేర సాగనుంది.
17వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనాలు - అమరావతి
PADAYATRA : అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. అడుగడుగునా ప్రజల ఆశీర్వాదాలు, సంఘీభావాలు, ఘనస్వాగతాలు, హారతుల నడుమ దిగ్విజయంగా సాగుతోంది. ఈ రోజు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి ప్రారంభమైన యాత్ర కొవ్వలి వరకు సాగునుంది.
PADAYATRA
రైతుల పాదయాత్రకు బాపట్ల జిల్లా చందలూరు రైతులు సంఘీభావం తెలిపారు. మరోవైపు యాత్రకు మద్దతుగా జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. పాదయాత్రకు వివిధ ప్రాంతాల నుంచి దివ్యాంగులు వచ్చి సంఘీభావం తెలిపారు. యాత్రలో తెదేపా నాయకులు నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్, గన్ని వీరాంజనేయులు, బడేటి బుజ్జి, పలువురు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: