రాష్ట్రంలో ఏడుగురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా అటవీశాఖ అధికారిగా ఏపీ టిడ్కో ఎండీ మహమ్మద్ దివాన్, కృష్ణా జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి షేక్ సలాం రాష్ట్ర సిల్వికల్చరిస్ట్‌గా బదిలీ అయ్యారు. చిత్తూరు అటవీ అధికారిగా రుద్రవరం సబ్ డివిజనల్ అటవీ అధికారి నరేంద్రన్‌కు పదోన్నతి కలిగింది. చిత్తూరు జిల్లా అటవీ అధికారి జగన్నాథ్సింగ్ను అనంతపురం అటవీ అధికారిగా బదిలీ చేశారు.
ఏడుగురు ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ - IFS officers transferred
రాష్ట్రంలో ఏడుగురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిలో పలువురికి పదోన్నతి లభించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏడుగురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ
శ్రీకాకుళం అటవీ అధికారిగా తిరుపతి సబ్ డివిజనల్ అటవీ అధికారి కృపాకర్‌కు పదోన్నతి లభించింది. నెల్లూరు జిల్లా అటవీ అధికారిగా డిప్యూటీ కన్జర్వేటర్ శ్రీనివాసరెడ్డి పదోన్నతి పొందారు. కర్నూలు జిల్లా అటవీ అధికారిగా డిప్యూటీ కన్జర్వేటర్ అలాన్ చాంగ్లను నియమిస్తూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండీ...రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..కీలక నిర్ణయాలివే..