ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: రేపటినుంచి గాంధీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి కొవిడ్‌ సేవలు - గాంధీలో పూర్తిస్థాయిలో కొవిడ్‌ సేవలు

తెలంగాణలోని గాంధీ ఆసుపత్రిలో.. రేపటినుంచి పూర్తిస్థాయిలో కొవిడ్‌ సేవలు అందనున్నాయి. గాంధీని పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు.. ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

gandhi hospital
గాంధీ ఆసుపత్రి

By

Published : Apr 16, 2021, 7:10 PM IST

రేపటి నుంచి తెలంగాణలోని గాంధీ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో కొవిడ్‌ సేవలు అందనున్నాయి. గాంధీని పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఓపీ సేవలు నిలిపివేసి.. కేవలం కొవిడ్ కేసులకు మాత్రమే చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

నిన్న ఒక్కరోజే గాంధీలో 150 మంది కరోనా బాధితులు అడ్మిట్‌ అయ్యారు. 10 నిమిషాలకు ఒక కరోనా బాధితుడు గాంధీలో చేరుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐపీ బ్లాక్ మొత్తం ఇప్పటికే కొవిడ్ పేషెంట్స్‌తో నిండిపోయిందని పేర్కొంది. రేపటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఆపేసి.. కేవలం కొవిడ్ ఆస్పత్రిగా సేవలు అందించనుందని ప్రకటించింది.

ఇదీ చూడండి:

రాష్ట్రానికి రానున్న 5 లక్షల కొవిడ్​ వ్యాక్సిన్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details