ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. దివ్యాంగుడికి పింఛన్​ ఇస్తానని సెర్ప్​ సీఈవో హామీ - దివ్యాంగుడికి పింఛన్​ అందజేసిన సెర్ప్​ సీఈవో ఇంతియాజ్

'వర్ధన్‌కు విధి వెక్కిరింత' అనే ఈటీవీ, ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన ఏపీ సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్​.. విజయవాడకు చెందిన దివ్యాంగుడు వర్ధన్‌కు పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

SERP CEO RESPOND
సెర్ప్​ సీఈవో ఇంతియాజ్

By

Published : Oct 12, 2021, 9:41 PM IST

'వర్ధన్‌కు విధి వెక్కిరింత' అనే ఈటీవీ-ఏపీ, 'అచేతనంగా కన్నబిడ్డ.. కంటికి రెప్పలా సాకుతున్న తల్లిదండ్రులు'ఈటీవీ భారత్​ కథనానికి సెర్ప్‌ సీఈవో స్పందించారు. విజయవాడలో వర్ధన్‌ అనే దివ్యాంగుడికి మూడు నెలలుగా పింఛన్‌ ఆగిపోవడంతో.. కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రల సమస్యతో పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ క్రమంలో ఈటీవీ-భారత్​లో కథనం ప్రచురిచతమైంది. దీనిపై స్పందించిన సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌.. వర్ధన్‌కు పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల పింఛన్‌ రాకపోతే తానే స్వయంగా వచ్చి ఇస్తానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details