Shamshabad accident: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పీఎస్ పరిధిలో సీరియల్ నటి లహరి తన కారుతో బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Shamshabad Accident: ప్రమాదం జరిగిన వెంటనే ఆందోళనకు గురైన లహరి... చాలా సేపటి వరకు కారు దిగలేదని స్థానికులు తెలిపారు. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నటి లహరిని బుధవారం ఉదయం స్టేషన్‌కు రావాలని సంతకం తీసుకుని పంపించారు.