'ప్రభుత్వ నిర్ణయంపై సుదీర్ఘ వాదనలు వినిపించాం' - nimmagadda ramesh kumar interview
పంచాయతీ రాజ్ చట్టం సహా ఎస్ఈసీ పదవి నుంచి రమేష్‌కుమార్‌ను తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. పదవీకాలం తగ్గించడం వల్లే నిమ్మగడ్డ పదవి కోల్పోయారని.. ఇందులో ప్రభుత్వం దురుద్దేశంతో చేసిందేమీ లేదని ఏజీ వాదించారు. ఆ వివరాలపై సీనియర్ న్యాయవాదితో మా ప్రతినిధి ముఖాముఖి..!
పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ సహా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. తదుపరి వాదనలను హైకోర్టు నేటికి వాయిదా వేసింది. ఇవాళ ప్రభుత్వం తరపున ఇవాళ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ వాదనలు వినిపించారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంస్కరణల కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వాదించారు. ఎస్ఈసీ పదవీ కాలం తగ్గించడం వల్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కోల్పోయారని... ఆయన్ను ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తొలగించలేదని వాదించారు. ఆర్డినెన్సును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశానికి సంబంధించి పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ముఖాముఖి..!