ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎస్​కు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ లేఖ.. ఎందుకంటే..! - AB venkateswararao letter to CS

Sr. IPS ABV Letter to CS :సీఎస్‌ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనను సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏబీవీ ఆ లేఖలో స్పష్టం చేశారు.

AB venkateswararao
AB venkateswararao

By

Published : Mar 25, 2022, 12:45 PM IST

Senior IPS ABV Letter to CS: సీఎస్‌ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనను సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏబీవీ ఆ లేఖలో స్పష్టం చేశారు. సస్పెన్షన్‌ రెండేళ్లు పూర్తయినందున తొలగిపోయినట్లేనని ఆయన లేఖలో ప్రస్తావించారు. సర్వీస్ రూల్స్ ప్రకారం సస్పెన్షన్ తొలగినందున పూర్తి జీతం ఇవ్వాలని కోరారు. సస్పెన్షన్‌కు ఆరేసి నెలల చొప్పున పొడిగింపు జనవరి 27తోనే ముగిసిందన్నారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరని తెలిపారు. గడువులోగా అనుమతి తీసుకోనందున సస్పెన్షన్‌ ముగిసినట్లేనని ఏబీవీ పేర్కొన్నారు. 2021 జులై 31న సస్పెన్షన్‌ జీవో రహస్యంగా ఉంచారని ఆయనకు కూడా కాపీ ఇవ్వలేదని వివరించారు. ఏది ఏమైనా ఫిబ్రవరి 8తో సస్పెన్షన్ ముగిసినట్టేనని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో తేల్చి చెప్పారు.

నాపై విచారణకు ఏనాడూ వెనకాడలేదు:నాపై ప్రభుత్వం జరిపిన విచారణలో నేను వెనక్కి తగ్గలేదు. తాత్సారం చేసే ఎత్తుగడలు వేయలేదు. పది, పన్నెండేళ్లు సాగదీయాలనుకోలేదు. ఈ రోజు రాలేను.. రేపు రాలేను.. ఫలానా కారణాలతో రాలేను.. పిటిషన్‌ అక్కడ పెండింగ్‌లో ఉంది. ఇక్కడ పెండింగ్‌లో ఉంది అంటూ ఏ రోజూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. త్వరగా విచారణ జరిపి నిజానిజాలేమిటో తేల్చమనే అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం నాపై విచారణ జరిపి సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సమ్మతి కోసం ప్రతిపాదనలు పంపించింది. వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేనూ కేంద్రాన్ని కోరాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని పత్రాలు రాలేదని వారు చెబుతున్నారు. నా సస్పెన్షన్‌ చెల్లదని, అది చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఏడాదిగా అక్కడ పెండింగ్‌లో ఉంది. వీటిలో జాప్యానికి నేను కారణం కాదు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details