సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థికవేత్త బీపీ విఠల్ కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఐఎంఎఫ్‌కు సలహాదారుగా, పదో ఆర్థిక సంఘం సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. విఠల్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ విఠల్ కన్నుమూత - senior ias bp vital death news
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ విఠల్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. విఠల్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ విఠల్ కన్నుమూత
తెలంగాణ సర్ప్లస్ అనే పుస్తకాన్ని రాసిన విఠల్... రాష్ట్ర స్థిరత్వంపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారంటూ మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. బీపీ విఠల్ కుమారుడు సంజయ్ బారు ప్రధాని మీడియా సలహాదారునిగా పనిచేశారు. విఠల్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘ అధ్యక్షుడు బీపీ ఆచార్య సంతాపం తెలిపారు. గొప్ప అధికారిని కోల్పోయామని ఆచార్య అన్నారు.
ఇదీ చదవండి:మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!