ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం చేతిలోనే మండలి రద్దు: జంధ్యాల రవిశంకర్ - జంధ్యాల రవిశంకర్ ఆన్ కౌన్సిల్ కెన్సెల్

శాసన మండలి రద్దుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  మూడు రాజధానుల బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న ప్రభుత్వ ఆకాంక్షను సెలక్ట్ కమిటీ రూపంలో తాత్కాలికంగా అడ్డుపడటం వలన ఏకంగా మండలినే రద్దు చేసే యోచన కనిపిస్తోంది. మండలి అవసరమా అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.. మండలి భవితవ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు మండలి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటీ, దానిని రద్దు చేయాలంటే ఎలాంటి ప్రక్రియ పాటించాలనే అంశంపై సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి అరుణ్ ముఖాముఖి.

Senior advocate jandyala ravi shankar  interview
సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్

By

Published : Jan 24, 2020, 9:05 PM IST


మండలి రద్దు అంత సులభం కాదు

శాసన మండలి రద్దు అంత సులభమైన వ్యవహారం కాదన్న సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అన్నారు. గతంలో ఎన్టీఆర్ రాజీవ్‌గాంధీ సహకారంతో మండలిని రద్దు చేశారని ఆయన తెలిపారు. వైకాపాకు మెజారిటీ లేదని మండలి రద్దు చేయాలనుకోవడం సరికాదన్నారు.

మండలి రద్దుపై : సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వ్యాఖ్యలు

మండలి ఖర్చు అనేది దురుద్దేశం మాత్రమే

మండలి రద్దు చేయడానికి ఓ నిర్ణీత ప్రక్రియ ఉంటుందని జంధ్యాల రవిశంకర్ తెలిపారు. మండలి వల్ల అనవసర ఖర్చులు అవుతున్నాయన్న వాదనలో పస లేదన్న ఆయన... మండలి ఖర్చుతో కూడిందని దాన్ని పునరుద్ధరించిన వైఎస్‌కు తెలియదా అని ప్రశ్నించారు.

మండలి నిర్వహణ ఖర్చుపై జంధ్యాల రవిశంకర్ వ్యాఖ్యలు

ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే..!

సెలక్టు కమిటీకి వెళ్లిన బిల్లుపై ప్రభుత్వం చేపట్టే విధానంపై కోర్టుకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులో ప్రభుత్వం చెప్తున్న సమాధానాలకు, బయట వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదన్నారు. మండలి రద్దు అనేది రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి కోర్టు అన్ని విధాల చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.

సెలక్ట్ కమిటీపై సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్

ఇదీ చదవండి :'సెలక్ట్ కమిటీ అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం'

ABOUT THE AUTHOR

...view details