గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని రైతుల దీక్షా శిబిరం వద్ద.. శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాస్ కేకు కట్ చేశారు. క్రైస్తవ గీతాలకు చిన్నారులు నృత్యాలు చేశారు. స్థానిక పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. అమరావతి ఉద్యమానికి ఏసు క్రీస్తు అండగా నిలవాలని ప్రార్థనలు చేశారు.
దీక్షా శిబిరంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన కృష్ణాయపాలెం దీక్షా శిబిరం
రాజధాని రైతుల దీక్షా శిబిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్, ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడు శ్రీనివాస్ హాజరై.. ఉద్యమానికి ఏసు కృప కోసం ప్రార్థించారు.
కృష్ణాయపాలెం దీక్షా శిబిరంలో జరిగిన సెమీ క్రిస్టమస్ వేడుకలు