ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ : సెల్ఫీ సరదా... రెండు ప్రాణాలు తీసింది - telangana varthalu

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. డిండి జలాశయం వద్ద సెల్ఫీ తీసుకుంటూ... ఇద్దరు యువకులు జలాశయంలో పడి మృతి చెందారు.

సెల్ఫీ సరదా... రెండు ప్రాణాలు తీసింది
సెల్ఫీ సరదా... రెండు ప్రాణాలు తీసింది

By

Published : Oct 17, 2021, 5:19 PM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా డిండి జలాశయం వద్ద విషాదం చోటుచేసుకుంది. సెల్పీ తీసుకోవాలనే సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. జలాశయం వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి ఇద్దరు యువకులు జలాశయంలో పడి మృతి(Selfie tragedy) చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​కు చెందిన సాగర్​, ప్రవీణ్​లు శ్రీశైలం దర్శనానికి కలిసి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తూ డిండి జలాశయం వద్ద కాసే కాలక్షేపం చేద్దామనే ఉద్దేశంతో ఆగారు.

అక్కడ దృశ్యాలను చరవాణిలో బంధించి.. సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ దిగుతుండగా కాలు జారి జలాశయంలో పడిపోయారు. వారికి ఈత రాకపోవడంతో నీటిలోనే మునిగిపోయారు. జలాశయాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సెల్ఫీల మోజులో పడి... ప్రమాదంలో పడొద్దంటూ హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: PETROL : పెట్రోల్ కల్తీ... వినియోగదారుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details