ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ : కరోనా కట్టడికి పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్​డౌన్​

కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతుండటం వల్ల గ్రామస్థులు అప్రమత్తమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం లాక్​డౌన్​ పెట్టబోమని స్పష్టం చేయగా... నిజామాబాద్​ జిల్లాలోని పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్​డౌన్​ విధించుకుంటున్నారు. కరోనాను కట్టడి చేసేంత వరకు ఈ స్వచ్ఛంద లాక్​డౌన్​ కొనసాగించుకుంటామంటున్నారు.

self lock down in nizamabad district villages
నిజామాబాద్​ జిల్లాలోని పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్​డౌన్

By

Published : Apr 9, 2021, 12:31 PM IST

తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర క్యాంప్ గ్రామంలో స్వచ్ఛంద లాక్​డౌన్ విధించుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల గ్రామంలోనూ కరోనా కేసులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామంలోని దుకాణాలను 10 రోజుల పాటు స్వచ్ఛందగా మూసేశారు. లాక్​డౌన్​తో గ్రామంలోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. కరోనాను అరికట్టడానికి స్వచ్ఛంద లాక్​డౌన్ విధించుకుని జాగ్రత్తలు పాటిస్తున్నామని గ్రామస్థులు అంటున్నారు.

మరోవైపు వేల్పూరు మండలంలోని మోతే గ్రామంలోనూ స్వచ్ఛంద లాక్​డౌన్​ పాటిస్తున్నారు. గ్రామంలో కరోనా కేసులు నమోదవుతుండటం వల్ల పాలకమండలితో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సైతం అప్రత్తమై... ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపార సముదాయాల్ని మూసేశారు. ప్రజలను బయటికి రావద్దని అవగాహన కల్పించారు. గ్రామంలో కరోనా కేసులు తగ్గేవరకు స్వచ్ఛంద లాక్​డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం

ABOUT THE AUTHOR

...view details