ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

300 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్​ - Marijuana seized by bhadrachalam police

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు 300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.45 లక్షల విలువ చేసే గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించారు.

ganja caught in bhadrachalam
భద్రాచలంలో 300 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Mar 22, 2021, 12:01 AM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అటవీ చెక్​పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 300 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. ఒక బొలెరో వాహనం, ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.45 లక్షల వరకు ఉంటుందని సీఐ స్వామి తెలిపారు.

నిందితులంతా ఏపీకి చెందిన వారని సీఐ పేర్కొన్నారు. సీలేరులోని పార్వతీనగర్ నుంచి సారపాకకు వీరు గంజాయిని తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. వాహనాలను సీజ్​ చేసి, నిందితులను రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details