ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శంషాబాద్‌ విమానాశ్రయంలో 1.59 కిలోల బంగారం పట్టివేత - gold found at rajeev gandhi international airport

తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో కస్టమ్స్​ అధికారులు ఓ మహిళ వద్ద నుంచి పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి వద్ద నుంచి రూ.4 లక్షలు విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Breaking News

By

Published : Mar 3, 2021, 9:14 PM IST

హైదరాబాద్​ శంషాబాద్ ఎయిర్​ పోర్ట్​లో 1.593 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హకీమ్​పేటకు చెందిన ఓ మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్​కు వచ్చారు. పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారు. పేస్ట్ రూపంలో దాచుకున్న 75 లక్షలు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

మరో వ్యక్తి దగ్గరి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన విదేశీ సిగరెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

ఇవీచూడండి:పలమనేరు పురపాలక సంఘం వద్ద తోపులాట

ABOUT THE AUTHOR

...view details