ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

seedless watermelon : గింజలేని పుచ్చసాగు... షోనిమా, స్వర్ణ రకం విత్తనాల అభివృద్ధి - seedless watermelon seeds developed by kerala agriculture university

గింజలేని పుచ్చ విత్తనాలను దేశంలోనే తొలిసారిగా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. షోనిమా, స్వర్ణ రకం విత్తనాల అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా వివిధ వాతావరణ పరిస్థితుల్లో సాగుకు అనువైనవిగా వీటిని నిర్ధారించారు. స్టేట్ హార్టికల్చర్ మిషన్ పథకంలో భాగంగా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పంటను రైతులతో సాగుచేయిస్తున్నారు. ఈ తరహా పండ్లపై దిల్లీ వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలో పరిశోధన నిర్వహించినా ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటంతో విత్తనాలు విడుదల చేయలేదు.

గింజలేని పుచ్చసాగు
గింజలేని పుచ్చసాగు

By

Published : Oct 3, 2021, 7:48 PM IST

గింజలేని పుచ్చసాగు

గింజ రహిత పుచ్చకాయలను వినియోగదారులకు అందించటానికి దేశంలోని ఉద్యాన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో గింజ లేని కాయలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా కాయలు... జ్యూస్, పల్ప్ తదితర ఉత్పత్తుల తయారీకి అనువుగా ఉంటాయి. తాజాగా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా.ప్రదీప్ కుమార్ బృందం గింజ లేని రెండు హైబ్రిడ్ పుచ్చకాయలపై పరిశోధనలు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించింది. దేశంలో తొలిసారి గింజలేని పుచ్చ విత్తనం అభివృద్ధి చేసిన ఘనత కూడా కేరళ వర్శిటీకే దక్కింది. వీటిలో షోనిమా రకం పుచ్చపండు ఎర్రటి కండతోనూ, స్వర్ణ రకం పండు పసుపు రంగు కండతోనూ ఉంటుంది.

విత్తనాలకు మంచి ఆదరణ...

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారతదేశంలో కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే గింజలేని పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. అమెరికా, జపాన్, కెనడా వంటి దేశాల్లో రైతులు 80 శాతం మేర గింజలేని పుచ్చనే ఉత్పత్తి చేస్తున్నారు. గింజ రహిత పుచ్చ విత్తనం ఖరీదు ఎక్కువగా ఉండటం, పెట్టుబడి ఖర్చు కూడా అధికంగా ఉండి, రాబడి తక్కువగా ఉండటం వల్లే మన దేశంలో రైతులు ఈ తరహా పుచ్చ సాగుకు ఆసక్తి చూపటంలేదు. ప్రస్తుతం కేరళ వ్యవసాయ వర్శిటీ విడుదల చేసిన విత్తనాలకు ఆదరణ బాగుంది.

అవగాహన వచ్చిన తరువాతే...

ఈ రెండు కొత్త హైబ్రిడ్ విత్తనాలతో ప్రతి మొక్కకు మూడు కాయలు వస్తాయని, ప్రతి కాయ రెండున్నర నుంచి మూడు కిలోల బరువుతో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గింజలేని పుచ్చ సాగుపై పూర్తిగా అవగాహన వచ్చిన తరువాతే రైతులు సాగు చేయాలని బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గింజలేని పుచ్చ విత్తనాలు కావాలనుకునే రైతులు... కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన ఖాతాకు సొమ్ము బదిలీ చేస్తే, కొరియర్ ద్వారా విత్తనాలు పంపుతున్నట్లు వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీచదవండి.

Thalassemia: గిరిపుత్రులకు తలసీమియా.. ఆసరా కోసం ఎదురుచూపులు..!

ABOUT THE AUTHOR

...view details