మంత్రి కొడాలి నాని సహా ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి కొడాలి నానికి(Minister Kodali Nani) ప్రస్తుతం ఉన్న 2+2 గన్మెన్ల భద్రతతో పాటు అదనంగా 1+4 గన్మెన్లు, కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా వై-కేటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi), అంబటి రాంబాబు(Ambati Rambabu), ద్వారంపూడి చంద్రశేఖర్(Dwarampudi Chandrashekar)లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్మెన్లతో పాటు అదనంగా 3+3 గన్‌మెన్ భద్రత కల్పించింది.
Security Increase : మంత్రి కొడాలి నాని సహా ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు - Security increased to ambati rambabu
శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాలతో మంత్రి కొడాలి నాని, ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం(Increase Security Increasing to MLA's, Minister kodali nani) భద్రత పెంచింది. చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వస్తున్నాయన్న నేతల ఫిర్యాదుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మంత్రి కొడాలి నానికి భద్రత పెంపు
తెదేపా అధినేత చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వచ్చినట్టుగా మంత్రి, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల పరిశీలన అనంతరం వారి భద్రతను సమీక్షించిన కమిటీ, వారికి తక్షణం భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, ద్వారంపూడిలకు అదనపు సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.
ఇదీచదవండి.