రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు 64 శాతం పోలింగ్.. 2.30 గంటలకు 76 శాతం మేర ఓటింగ్ జరిగిందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్, పంచాయతీ ఎన్నికల రాష్ట్ర అధికారి గిరిజా శంకర్ తెలిపారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కొన్ని సంఘటనలు జరిగాయని స్పష్టం చేశారు. 539 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 9 వేల పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు వచ్చినా సర్దుబాటు అయ్యాయని తెలిపారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: గిరిజాశంకర్ - panchayat elections updates
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు 76 శాతం మేర ఓటింగ్ నమోదైందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్, పంచాయతీ ఎన్నికల రాష్ట్ర అధికారి గిరిజా శంకర్ తెలిపారు.
గిరిజా శంకర్