ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

OMICRON CASE IN AP: రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు - ap

రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు
రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు

By

Published : Dec 22, 2021, 12:07 PM IST

Updated : Dec 23, 2021, 7:06 AM IST

12:05 December 22

కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ గుర్తింపు

రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. కెన్యా నుంచి చెన్నై విమానాశ్రయం ద్వారా తిరుపతికి వచ్చిన మహిళకు కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు వైద్యారోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి (34) ఒమిక్రాన్‌ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 45 మంది కొవిడ్‌ బారినపడ్డారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిందరి నమూనాలను సీసీఎంబీకి పంపారు. అంతా ఆరోగ్యంగా ఉన్నారు.

కెన్యాకు చెందిన మహిళ (39) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 10న చెన్నై వచ్చారు. అక్కడి నుంచి కారులో తిరుపతిలోని తన తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్నారు. ఆమెకు ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో చెన్నై విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ నిర్వహించలేదు. ఇంటికి వచ్చాక తన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా గడిపారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ నెల 12న ఆమె నుంచి నమూనా సేకరించి పరీక్షించగా... కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. నమూనాను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి పంపించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిర్ధారిస్తూ సీసీఎంబీ ఈనెల 22న సమాచారం ఇచ్చారు. బాధిత మహిళను తిరుపతిలోని విష్ణు నివాసంలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకురాలు హైమావతి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 103 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

Last Updated : Dec 23, 2021, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details