ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP Mahanadu: 'ఎన్టీఆర్​కు భారతరత్న ఇప్పించటమే నిజమైన నివాళి' - TDP Mahanadu 2021

కరోనా తీవ్రత దృష్ట్యా...నేడు రెండోరోజు వర్చువల్ ద్వారా తెలుగుదేశం మహానాడు(Mahanadu) ప్రారంభమైంది. ఎన్టీఆర్ ప్రతిమకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.

TDP Mahanadu 2021
TDP Mahanadu 2021

By

Published : May 28, 2021, 11:05 AM IST

Updated : May 28, 2021, 12:03 PM IST

ఎన్టీఆర్(NTR)​కు భారతరత్న ఇప్పించటమే నిజమైన నివాళని తెలుగుదేశం మహానాడు స్పష్టం చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు(Nandamuri Taraka ramarao) కు ఘననివాళులు అర్పిస్తూ... రెండో రోజు మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ప్రతిమకు తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) నివాళులర్పించి.. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

'ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక-సామాజిక న్యాయ ప్రధాత ఎన్టీఆర్​'కు నివాళి పేరిట అశోక్ గజపతి రాజు(Ashok Gajapati Raju) ప్రవేశపెట్టిన తీర్మానాన్ని.. తెలంగాణ తెదేపా అధ్యక్షులు ఎల్.రమణ, నందమూరి బాలకృష్ణ, పీఆర్ మోహన్, శ్రీపతి సతీష్, గొల్లపల్లి సూర్యారావు తదితరులు బలపరిచారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అశోక్‌ గజపతిరాజు కోరారు. ప్రాంతాలకు అతీతంగా బడుగు, బలహీనవర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ పనిచేశారని ఎల్.రమణ కొనియాడారు.

ఎన్టీఆరే ఆదర్శం: బాలకృష్ణ

ఎన్టీఆర్ తనకు తండ్రి మాత్రమే కాదని.. గురువు దైవం కూడా అని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వెల్లడించారు. ప్రతి విషయంలోనూ తనకు ఎన్టీఆరే ఆదర్శమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్న బాలకృష్ణ.. ఈనాడు దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

ఇదీ చదవండి:

Inhumanity: తల్లిని ఇంట్లోకి రానివ్వని కుమారులు!

Last Updated : May 28, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details