ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారం, వజ్రాలు సీజ్‌.. ఎక్కడంటే - ED raids in Musaddilal Gems and Jewellery

ED raids in Musaddilal Gems and Jewellery: హైదరాబాద్​లో ముసద్దీలాల్ జెమ్స్ ఆండ్ జువెల్లర్స్ షోరూంలో రెండో రోజూ ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 3 షోరూంలలో రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారం, వజ్రాలను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు.

ED
ED

By

Published : Oct 18, 2022, 3:14 PM IST

ED raids in Musaddilal Gems and Jewellery: హైదరాబాద్​లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్​లో రెండో రోజూ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. 3 షోరూంలలో రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారం, వజ్రాలు సీజ్‌ చేశారు. రూ.50 కోట్ల విలువైన బినామీ ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సుఖేష్‌ గుప్తా, అనురాగ్‌ గుప్తాకు చెందిన ఆస్తులను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. ఇదివరకే సుఖేష్‌ గుప్తా, అనురాగ్‌ గుప్తాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇరువురిపై సీబీఐ ఛార్జ్​షీట్‌ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తోంది. బంగారం అమ్మకాల సొమ్మును ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ గుర్తించింది. గతేడాది రూ.323 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

గతంలో ముసద్దీలాల్ జువెల్లర్స్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. నోట్ల రద్దు సమయంలో నకిలీ బిల్లులు సృష్టించి నగదు చలామణి చేశారన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి.. 130కోట్ల రూపాయల ఆస్తులను గతేడాది ఫిబ్రవరిలో అటాచ్ చేశారు. నోట్ల రద్దు సమయంలో ముసద్దీలాల్ జువెల్లర్స్‌కు చెందిన యాజమాన్యం డబ్బులను వారి ఖాతాలో భారీ ఎత్తున డిపాజిట్ చేశారు. ఈ డబ్బంతా బంగారు విక్రయం ద్వారా వచ్చినట్లు పత్రాలు చూపించారు. నవంబర్ 8, 2016న పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు మోదీ రాత్రి 8 గంటలకు ప్రకటించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే దాదాపు 6వేల మందికి బంగారం విక్రయించగా.. రూ. 100కోట్ల పైగా నగదు వచ్చినట్లు చూపించారు. ఈ నగదునంతా తిరిగి బులియన్ మార్కెట్‌లో బంగారంలో పెట్టుబడి పెట్టి.. ఆ బంగారాన్ని మార్కెట్లో అధిక లాభాలకు విక్రయించినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఆ కేసు కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details