అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై రెండో రోజూ గ్రామసభలు జరగనున్నాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో గ్రామసభలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు కురుగల్లు, నీరుకొండ గ్రామసభల్లో ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్మానాలు చేశారు. మిగతా గ్రామాల్లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తామని రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు.
AMARAVATI CORPORATION : అమరావతి రాజధాని నగరపాలక సంస్థ... రెండో రోజూ గ్రామసభలు - amaravati corporation
అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై రెండో రోజూ గ్రామసభలు జరగనున్నాయి. 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి జరగదని, 29 గ్రామాలతో కూడిన రాజధానిని ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని ప్రజలు వెల్లడించారు.
అమరావతి రాజధాని నగరపాలక సంస్థ
అమరావతి బృహత్ ప్రణాళికకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం కుట్ర పన్నిందని పలు గ్రామాల ప్రజలు ఆరోపించారు. 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి జరగదని అభిప్రాయపడ్డారు. 29 గ్రామాలతో కూడిన రాజధానిని ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ఎంపీ నందిగం సురేశ్ స్వగ్రామమైన ఉద్ధండరాయునిపాలెంలో గ్రామసభ జరుగుతున్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇదీచదవండి.