పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే అని చెప్పారు. కొవిడ్ టీకా ప్రక్రియలో ఉన్నామని చెప్పినా రాష్ట్ర ఎన్నికల సంఘం మొండివైఖరితో ముందుకెళ్తోందని విమర్శించింది. గతేడాది మార్చి 15న ఒకే కరోనా కేసున్నా స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని జి.కె. ద్వివేది చెప్పారు. ఇప్పుడు కూడా అలానే ప్రవర్తిస్తోందని ప్రకటనలో పేర్కొంది.
'ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్‌ఈసీ నిర్ణయం' - ఏపీ ఎస్‌ఈసీ తాజా వార్తలు
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్నారని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది విమర్శించారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే అని అన్నారు.
gopala krishna dwivedi