ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ ప్రభుత్వ ఒత్తిళ్లకు ఎస్ఈసీ లొంగకూడదు: యనమల - Yanamala comments on jagan

రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను హైకోర్టు నిలుపుదల చేయడంపై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతించారు. మెజారిటీ రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఎస్​ఈసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

యనమల రామకృష్ణుడు
యనమల రామకృష్ణుడు

By

Published : Apr 6, 2021, 6:53 PM IST

పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. "జగన్ ప్రభుత్వం ఒత్తిళ్లకు ఎస్ఈసీ లొంగకూడదు. పోలింగ్ తేదీకి 4వారాల ముందు కోడ్ అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం... ఎస్ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించకూడదు. తనది రాజ్యాంగ పదవి అని... జగన్ సేవ కాదని ఎస్ఈసీ గ్రహించాలి. మెజారిటీ రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలి" అని యనమల వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details